రెండేళ్ల తర్వాతే ‘అవతార్ 2’ రిలీజ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రెండేళ్ల తర్వాతే ‘అవతార్ 2’ రిలీజ్..

May 8, 2019

హాలీవుడ్ విజువల్ వండర్‌గా నిలిచి, ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం ‘అవతార్’.. పిల్లలు, పెద్దలందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీంతో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్  సీక్వెల్స్ రూపిందించడంతో బిజీగా ఉన్నాడు. 

రెండో భాగం 2021 డిసెంబర్ 17 రెండో రిలీజ్ అవతున్నట్లు డైరెక్టర్ కామెరూన్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మొదట ఈ సినిమా సీక్వెల్‌ 2020 డిసెంబర్‌లోనే రిలీజ్‌ అవుతుందని భావించినా.. నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాటు వాయిదా పడింది. 3, 4, 5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్ చేస్తుంది.

2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ అప్పటి వరకు ఉన్న హాలీవుడ్ కలెక్షన్ రికార్డులన్నీంటినీ బ్రెక్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఇటీవల రిలీజ్ అయిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’.. అవతార్ మూవీ రికార్డులను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే డైరెక్టర్ కామెరూన్ అవతార్2తో మరోసారి ఆల్ టైం రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరీ.