ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంక్షోభం ఇప్పుడు నెమ్మదిగా తీవ్రమవుతోంది. మల్టీనేషన్ కంపెనీలన్నింటినీ కూడా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకుని..ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని వెతుకుతున్నాయి.అందులో భాగంగానే ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్ వేర్ దిగ్గజాలతోపాటుగా బోయింగ్ వంటి విమానయాన సంస్థలు కూడా ఉద్యోగుల్లో కోతలు విధించాయి.
ఇప్పుడు తాజాగా ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కంపనీ సీఈవో బాబ్ ఇగర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగులు, ప్రతిభ, అంకితభావం పట్ల నాకు గౌరవం ఉంది. తొలిసారిగా 7వేల మంది ఉద్యోగులను తొలగించడం బాధాకరమే అయినప్పటికీ..తప్పనిపరిస్థితుల్లో తొలగించాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు.
5.5 బిలియన్ల ఖర్చులను తగ్గించుకునేందుు 7వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది కంపెనీ ఉద్యోగుల్లో మొత్తం 3.6శాతంగా ఉంటుందన్నారు. కంపెనీలో మొత్తం 2లక్షల 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డిస్నీకి సబ్ స్క్రైబర్లు చాలా తగ్గిపోయారు. గత మూడు నెలల్లో డిస్నీ ప్లక్ కి వినియోగదారుల సంఖ్య ఒక శాతం తగ్గింది. దీంతో 168.1మిలియన్ కు పడిపోయారు. నష్టాలు భారీగా పెరుగుతుండటంతో కొత్త నియామకాలను నిలిపివేసింది డిస్నీ.