చనిపోబోతున్న అతనికి చూపించాకే విడుదల   - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోబోతున్న అతనికి చూపించాకే విడుదల  

December 2, 2019

ప్రపంచంలోనే అతిపెద్ద వినోదాల మిశ్రమ సంస్థ డిస్నీ ఓ పని చేసి ఎంతో మంది మనసు దోచుకుంది. దీని ద్వారా వచ్చే సినిమా సిరీసులకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. అలాంటి సంస్థ చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తి చివరి కోరికను తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈనెల 20న విడుదల కాబోతున్న‘స్టార్‌వార్స్.. ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ సినిమాను విడుదలకు ముందే చూపించేందుకు నిర్ణయించింది. థ్యాంక్స్ గివింగ్ వేడుకకు మందే అతని కోరిక తీరుస్తామని డిస్నీ సీఈవో రాబర్ట్  ప్రకటించారు. 

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి  స్టార్ వార్ ఫ్రాంచైస్‌‌కు వీరాభిమాని. ఈ సినిమా వచ్చే కంటే ముందే అతడు తనకున్న అరుదైన వ్యాధితో  మరణించబోతున్నాడు. కానీ ఎలాగైనా తాను చనిపోయే లోపు ‘స్టార్‌వార్స్.. ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ అతని కొడుకుతో కలిసి చూడాలనుకున్నాడు. ఈ విషయాన్ని రోవన్స్ హాస్పైస్ ఛారిటీ సభ్యులకు చెప్పాడు. వారు అతని కోరికను డిస్నీ దృష్టికి తీసుకెళ్లడంతో ట్విట్టర్‌లో ఈ పోస్ట్ వైరల్ అయింది. వెంటనే ఆ సంస్థ స్పందించింది. ఎలాగైనా ఆ వ్యక్తి చివరికోరికను తీర్చుతామని తెలిపారు. దీంతో తర్వలోనే ఆ వ్యక్తి తన కొడుకుతో కలిసి సినిమా రిలీజ్‌కు ముందే చూడబోతున్నాడు. 

ఈ విషయాన్ని రోవన్స్ హాస్పైస్ ఛారిటీ  వెల్లడించింది. తమ సంరక్షణలో ఉన్న ఆ వ్యక్తి అందరి కంటే ముందుగా ‘స్టార్‌వార్స్.. ది రైజ్ ఆఫ్ స్కైవాకర్’ చూడబోతున్నాడని వెల్లడించింది. అతని సంతోషాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.