dispute between a couple, Husband commits suicide After killing his wife in Panjagutta
mictv telugu

పంజాగుట్టలో దారుణం.. భార్యను చంపి.. ఆపై తానూ..

June 28, 2022

dispute between a couple, Husband commits suicide After killing his wife in Panjagutta

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన ఓ భర్త అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో లభించిన డైరీలో ఓ లెటర్ లో అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆ లెటర్ లో అతడు తన భార్యను నీళ్లతో ఉన్న బకెట్‌లో తల వరకు ముంచి హత్య చేసినట్లు పేర్కొన్నాడు. ఆర్పీఎఫ్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద్ బిశ్వాస్ (24) అతడి భార్య పంపా సర్కార్ (22) జీవనోపాధి నిమిత్తం గత 20 రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే జీవీకేలోని ఓ షాపులో భార్యాభర్తలు పనిచేస్తూ ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్నారు. అయితే మూడ్రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం సాయత్రం భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి హతమార్చాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో పంజాగుట్ట పోలీసులు ప్రేమ్‌నగర్‌లోని అతని నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి పంప సర్కార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పంజాగుట్ట డీఐ నాగయ్య తెలిపారు. క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.