అందులో బూతు ఏముంది?.. అనుష్కకు గవాస్కర్ కౌంటర్  - MicTv.in - Telugu News
mictv telugu

అందులో బూతు ఏముంది?.. అనుష్కకు గవాస్కర్ కౌంటర్ 

September 25, 2020

mv bhm

ఐపీఎల్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు సులువైన క్యాచ్‌లను విరాట్ చేజార్చాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో విరాట్‌పై భారత క్రికెట్ లెజెండ్, కామెంట్రేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లి ఎదుర్కొన్నాడు’ అంటూ విరాట్ ఔట్ అయిన సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గవాస్కర్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. విరాట్ భార్య అనుష్క శర్మ కూడా ఘాటుగా స్పందించింది. ‘మిస్టర్ గవాస్కర్.. మీ వ్యాఖ్యలు నా భర్తను అగౌరవపర్చేలా ఉన్నాయి. భర్త ఆట తీరు గురించి భార్యపై ఆరోపణలు చేస్తారా? భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో వివరిస్తే బాగుంటుంది’ అని అనుష్క ఇంస్టాగ్రామ్‌లో ప్రశ్నించింది. 

ఇన్నేళ్లుగా మీరు కమెంటేటర్‌గా వ్యాఖ్యానించేటప్పుడు ప్రతి క్రికెటర్‌ వ్యక్తిగత జీవితాలను గౌరవించారని తనకు తెలుసు అని తెలిపింది. ‘నాకు సమానమైన గౌరవం ఇవ్వాలని మీరు ఎందుకు భావించలేదు. నా భర్త ఆటతీరు గురించి మాట్లాడటానికి మీ మనసులో ఎన్నో పదాలు ఉన్నప్పటికీ.. నా విషయంలో ఏమి మారలేదు. 2020 సంవత్సరంలో కూడా క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు. నాపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఎప్పుడు వదిలేస్తారు? కేవలం మీ మాటలు విన్నప్పుడు నాకెంత బాధ వేసిందనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను’ అని అనుష్క పేర్కొంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి మ్యాచ్‌లో విజయం సాధించగా రెండవ మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కున్న విషయం తెలిసిందే.