దద్దరిల్లిన విజయవాడ.. రోడ్డెక్కిన నిరుద్యోగులు - MicTv.in - Telugu News
mictv telugu

దద్దరిల్లిన విజయవాడ.. రోడ్డెక్కిన నిరుద్యోగులు

March 12, 2022

jobb

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం విజయవాడలో నిరుద్యోగులు కదం తొక్కారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ధర్నా చేస్తున్న యువతను అరెస్ట్ చేశారు. విజయవాడకు విద్యార్థులు, పలు యువజన సంఘాల నేతలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో వారిని హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ‘అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. ఇప్పుడు మొండి చెయ్యి చూపిస్తున్నారు. జగన్ నిరుద్యోగులను మోసం చేశారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.5 వేల నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సిందేనన్నారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.