District Collector imposed Section 144 at Bhadrachalam due to floods
mictv telugu

భద్రాచలంలో 144 సెక్షన్.. మంథనిలో బాహుబలి సీన్

July 14, 2022

District Collector imposed Section 144 at Bhadrachalam due to floods

గోదావరికి వస్తున్న భారీ వరద కారణంగా ప్రజల క్షేమం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు బయటికి రాకుండా కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అటు వరదల వల్ల భద్రాచలానికి ఎవరూ రావొద్దని సూచించారు.

గోదావరిపై ఉన్న వంతెనపై గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాకపోకలను నిషేధిస్తున్నట్టు వెల్లడించారు. వరద ఇప్పటికే 68 అడుగులకు చేరిందని సాయంత్రం వరకు 70 అడుగుల వరకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరదల వల్ల పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం నీట మునిగింది. ప్రధాన కూడలిలో నీరు భుజంలోతు వరకు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఈ క్రమంలో మర్రివాడకు చెందిన ఓ కుటుంబం తన మూడు నెలల చిన్నారని బుట్టలో పెట్టి, బుట్టను తలపై పెట్టుకుని వరదను దాటుతున్న దృష్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు బాహుబలిలోని రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.