ఏపీలో విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 33 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. అర్హులైన అభ్యర్ధుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డిప్లొమా, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలనేది అర్హత. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఖాళీలు ఇవే
* పీడియాట్రిషియన్: 5
* ఎర్లీ ఇన్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 2
* అడాలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ కౌన్సెలర్: 6
* హాస్పిటల్ అటెండెంట్: 1
* శానిటరీ అటెండెంట్: 3
* సైకియాట్రిస్ట్: 1
* మెడికల్ ఆఫీసర్: 13
* క్లినికల్ సైకాలజిస్ట్: 1
* డెంటల్ టెక్నీషియన్: 1
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విశాఖపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21.01.2023.
వెబ్సైట్: https://visakhapatnam.ap.gov.in/
ఆసక్తి కలిగిన వారు జనవరి 21, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వెబ్సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని పై అడ్రస్‌లో సమర్పించాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.