చేతులెత్తినా కాల్చిచంపారు.. అమెరికా పోలీసుల దారుణం  - MicTv.in - Telugu News
mictv telugu

చేతులెత్తినా కాల్చిచంపారు.. అమెరికా పోలీసుల దారుణం 

October 27, 2019

Disturbing Video Shows San Bernardino Police Officer Fatally Shooting Unarmed Man

అమెరికన్ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్నారు. పోలీసులు ఆదేశించిన విధంగా తన చేతిలో ఉన్న తుపాకిని కిందపడేయడంతో పాటు, వారి సూచన మేరకు రెండు చేతులనూ పైకెత్తి ముందుకు నడుస్తున్న అతడిని అమెరికన్ పోలీసు ఒకరు ఐదుసార్లు తుపాకితో కాల్చి చంపాడు. ఈ వీడియో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. అన్యాయంగా ఒకరి ప్రాణాలు తీశారని విమర్శలు ఎదరవుతున్నాయి. ఈ ఉదంతంపై పోలీసు అధికారి యూనిఫామ్‌కు అమర్చివున్న వీడియోను విడుదల చేశారు. 


రిచర్డ్ సాంచెజ్(27) వాన్ బెర్మార్డినో ప్రాంతంలో నివశిస్తున్నాడు. అతని బంధువు ఒకరు 911కు కాల్ చేసి, అతను మత్తులో ఉన్నాడని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచివున్న ఇంటిముందు పోలీసులు గన్నులతో నిలబడి అతన్ని బయటకు రమ్మన్నారు. రిచర్డ్ చేతిలో ఉన్న గన్ కింద పారేసి రమ్మన్నారు. అతనికి కొద్ది దూరంలో ఓ యువతి నిలబడివుంది. రిచర్డ్ పోలీసుల ఆదేశాల అనుసారం గన్ కింద పారేశాడు. ఆపై పోలీసుల వైపు నడుస్తూ వచ్చాడు. రెండు చేతులూ పైకెత్తాలని పోలీసులు ఆదేశించగా, రెండు చేతులూ పైకెత్తి నడుస్తూ వచ్చాడు. అతన్ని ఆగాలని పోలీసులు సూచించారు. 

అతను ఆగకుండా అలాగే ముందుకు వస్తున్నాడు. దీంతో అతను తాము ఆదేశించినట్టు ఆగలేదన్న కారణంతో ఓ పోలీసు అధికారి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఐదు సార్లు అతనిపై కాల్పుడు జరిపాడు. ఈ ఘటనపై పోలీస్ చీఫ్ ఎరిక్ మెక్ బ్రైడ్ స్పందిస్తూ..  కాల్పులు జరిపిన పోలీసు అధికారి సంయమనం పాటించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అతన్ని విధుల నుంచి తొలగించామని, అతనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.