‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’లో పాల్గొన్న ఓ సాధారణ గృహిని రికార్డ్ సృష్టించింది. చదివింది 12వ తరగతే అయినా, కోటి రూపాయలను గెలుచుకుని, తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆమె అభినందించి, అనంతరం కోటి రూపాయల చెక్కును అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో గతకొన్ని నెలలుగా ఓ టీవీ ఛానెల్‌లో ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’ అనే పొగ్రాం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పొగ్రాం 13 సీజన్లు పూర్తి చేసుకొని, 14వ సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ 14 సీజన్‌లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ఈ ఘనత సాధించారు.
కవితా చావ్లా ఆమె మాట్లాడుతూ.. క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళను కావాలని అనుకున్నాను. నా కల నిజమైంది. ఓ రికార్డు సాధించా. ఈ షోలో పాల్గొనేందుకు నేను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదు. నా కుమారుడికి బోధించినా, పుస్తకాలనే నేను కూడా పదే పదే చదువుకునేదాణ్ణి. ముఖ్యమైన విషయాలను అండర్‌లైన్ చేసుకుని చదివేదాణ్ణి. నేను కేబీసీ షోను ఫాలో అయ్యేదాణ్ణి. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో నాకు బాగా తెలుసు. కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్మును నా కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తాను. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతాను” అని ఆమె అన్నారు.