Divita Rai's Departure For Miss Universe Compilation
mictv telugu

మిస్ యూనివర్స్ పోటీకి దివితా రాయ్..

December 30, 2022

Divita, pageant, miss universe, india, beauty

మిస్ యూనివర్స్ 2022 పోటీలు 14 జనవరి 2023న న్యూ ఓర్లీన్స్, లూసియానాలో జరుగనున్నాయి. ఈ సంవత్సరం భారతదేశం నుంచి దివితా రాయ్ ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే అక్కడికి బయలుదేరిన ఆ అమ్మాయి గురించి కొన్ని సంగతులు..

దివితా రాయ్ ఒక భారతీయ మోడల్. 71వ మిస్ యూనివర్స్ 2022 అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇప్పటికే మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకుంది. మరి ఈసారి ఈ పోటీలు ఈ అందం గెలుస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి. అయితే అంతకుముందు ఈ అందాల రాశి గురించి తెలుసుకోవాల్సిందే!

ఆర్కిటెక్ట్ గా..

1998లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది దివితా. చిన్నప్పటి నుంచి చాలా చలాకీ పిల్ల. కొన్నిరోజులు తన విద్యాభ్యాసం జరిగింది. కొన్నిరోజులు తన తండ్రి ఉద్యోగ బదిలీల కారణంగా ఇతర నగరాల్లో చదువాల్సి వచ్చింది. ఆమె సుమారు 6 పాఠశాల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ మాత్రం సర్ జె.జె. కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.. ఆర్కిటెక్చర్ పూర్తి చేసింది.మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన దివితాకి తల్లిదండ్రుల పై ప్రేమ ఎక్కువ. ఆమె తండ్రి పేరు దిలీప్ రాయ్, తల్లి ప్రవితా రాయ్, అన్న దైవిక్ రాయ్. అన్న అథ్లెట్. తండ్రి ఆమెకు రోల్ మోడల్ అని చెబుతున్నది. దివితాకి మోడలింగ్ అన్నా, కొత్త బట్టలు వేసుకోవడం అన్నా చాలా ఇష్టమంటున్నది. బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, పాటలు పాడడం, వినడం, పెయింటింగ్ వేయడం చాలా సరదా అంటున్నది.

ఆరాధ్య దేవత..

24 సంవత్సరాల దివితా ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నది. గతేడాది జరిగిన మిస్ దివా యూనివర్స్ 2021లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. అయితే ఈ పోటీ సమయంలో ఆమె మిస్ ఐక్యూ, మిస్ లైఫ్ స్టైల్, మిస్ సుడోకు సబ్ కాంటెస్ట్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ సంవత్సరం 28 ఆగస్టు 2022న ముంబైలో జరిగిన యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకున్నది. ఈ పోటీకి అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన 30 మంది మాజీ అందాల పోటీ విజేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుస్మితాసేన్ ఆమె ఆరాధ్య దైవంగా భావిస్తానంటున్నది.

ఇవి కూడా చదవండి :

రెడ్లా.. రాజులా.. శెట్టిలా.. ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

22ఏళ్ళ తరువాత మరో సంచలనం.. మెగా మాస్ సాంగ్ పూనకాలు రిలీజ్..!

రాహుల్ సిప్లిగంజ్ దావత్ పాట