మనసు మార్చుకున్న దివ్వవాణి.. టీడీపీకి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

మనసు మార్చుకున్న దివ్వవాణి.. టీడీపీకి రాజీనామా

June 2, 2022

టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి, ప్రముఖ సినీనటి దివ్వావాణి మళ్లీ మనసు మార్చుకున్నారు. బుధవారం టీడీపీకీ రాజీనామా చేస్తున్నానని మరోసారి ప్రకటించారు. ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, ఆ తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె సమావేశమయ్యారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ఓ వీడియో ద్వారా రాజీనామా సందేశాన్ని విడుదల చేశారు. గురువారం ఉదయం రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు.

తాజాగా రాజీనామాకు ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ మహానాడులో తనకు తీరని అవమానం జరిగిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవలే ఆమె ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై దానిని డిలీట్ చేసి, చర్చకు తెరలేపారు. గత రాత్రి అధినేత చంద్రబాబుతో సమావేశమైన ఆమె తన రాజీనామా వార్తలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..”నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ట్వీట్ కనిపించింది. అందుకనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ ట్వీట్ చేశాను. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే, ఫేక్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు” అని ఆమె అన్నారు. మళ్లీ ఏమైందో కానీ అంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు. ఓ వీడియోను విడుదల చేసి, టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.