పల్టీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

పల్టీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

September 26, 2019

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సు సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రమాదంలో పది మందికి  తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో రాజమండ్రికి చెందిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. వారిని హైదరాబాద్‌కు తరలించారు.అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తలో ఉన్నారు. ఏమి జరిగిందో తెలియరాలేదు. బస్సు బోల్లా పడిన వెంటనే ఒకరిపై ఒకరు పడిపోయారు. విషయం తెలిసిన పోలీసులు స్థానికుల సాయంతో వారిని బయటకు తీశారు.

Travels Bus.

డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనావేస్తున్నారు. రాత్రిపూట ప్రయాణం కావడంతో నిద్రమత్తులో వాహనం నడపటం వల్ల బస్సు అదుపుతప్పిందని ప్రయాణీకులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా ఎన్నిసార్లు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపించినా వారిలో మాత్రం మార్పురావడంలేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపంలా మారిపోయాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ట్రావెల్స్ యాజమాన్యం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేన్నారు.