నోట్లో సిగరెట్‌.. క్షణాల్లో బాణసంచా ఖతం.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్లో సిగరెట్‌.. క్షణాల్లో బాణసంచా ఖతం..

October 28, 2019

దీపావళి బాణసంచా కాల్చడంలో ఒక్కోరిది ఒక్కో స్టయిల్. కొందరు బారెడు కర్రెలకు అగరుబత్తి జత చేసి దూరం నుంచి టపాకాయలు కాల్చేస్తారు. కొందరు చేత్తో అగరుబత్తి పట్టుకుని కాల్చేస్తారు. కానీ ఈ వీడియోలోని మనిషి మాత్రం నోటితో కాల్చేస్తున్నాడు. ఏదో సర్కస్‌లో పనిచేసిన అనుభవం కూడా ఉన్నట్లు లేదు. కామన్ మేన్. కానీ కాల్చుడులో మాత్రం ఖతర్నాక్ 

 ఈ పెద్దాయన సిగరెట్ ఊదుతూ చేత్తో అరడజను రాకెట్లు పట్టుకున్నాడు. ఒక్కో రాకెట్‌‌ను నోటిదగ్గరికి తీసుకుని సిగరెట్ తో అంటించి పైకి విసిరేస్తున్నాడు. అంతా క్షణాల్లోనే సాగిపోతోంది. రాకెట్లన్నీ క్షణాల్లోనే ఎగిరిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు అనుభవంతో ఆ విన్యాసం సాధించాడని, అందరూ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. డ్రోన్‌కు టపాసులు కట్టి పటపటా పేల్చేస్తున్నారు. టపాసులు తమపై పడిపోతాయని జనం పారిపోతున్నారు.