దీపావళి బాణసంచాపై జగన్ సర్కారు ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి బాణసంచాపై జగన్ సర్కారు ఆంక్షలు

November 11, 2020

Diwali festival Andhra Pradesh Government restrictions fireworks crackers

దీపావళి పండగ రోజున పటాకులు కాల్చొద్దని పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా స్పందించింది. పండగ రోజలు బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించింది. రాత్రి పూట 8 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం రెండు గంటలు వ్యవధిలో మాత్రమే పటాకులు కాల్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే వ్యాపారులు పర్యావరణ అనుకూలమైన బాణసంచా మాత్రమే అమ్మాలని కోరింది.

కరోనా వైరస్ వ్యాపించకుండా దుకాణాల మధ్య 10 అడుగుల దూరం  పాటించాలని, కొనుగోలుదారుల మధ్య 6 అడుగులు దూరం  ఉండాలని స్పష్టం చేసింది. అగ్నిప్రమాదాలను నివారించడానికి దుకాణాల వద్ద శానిటైజర్ వాడకూడదని పేర్కొంది. కాలుష్యం, కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పటాలకుపై ఆంక్షలు విధించడం, ఉల్లంఘిస్తే లక్ష వరకు జరిమానా వేస్తామని హెచ్చరించడం తెలిసిందే. యూపీ, కర్ణాటక, హరియాణా తదితర రాష్ట్రాల్లోనూ ఆంక్షలు, నిషేధాలు అమల్లోకి వచ్చాయి.