దీపావళికి  మోటో ఆఫర్లు…!

దీపావళి సందర్భంగా మోటో మొబైల్ సంస్థ స్మార్ట్ ఫోన్లపై  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి 21 దాకా ఈప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుందట. 100 జీబీ 4జీ రిలయన్స్ జియో డేటాను యూజర్లకు ఆఫర్‌ చేయడంతో పాటు, ఫోన్లపై ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని మోటో కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ భారత మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందట. అయితే  మోటో అందిస్తున్న ‘స్పెషల్‌ దీపావళి ఆఫర్‌’ కేవలం ఆఫ్‌లైన్‌ స్టోర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

ఫోన్లపై తగ్గించిన ధరలు..

*మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.8,999 నుంచి రూ.8,199కు తగ్గించింది

*మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌ 12,599 నుంచి రూ.10,999కే అందుబాటులోకి తెచ్చింది

* రూ.16,999 రూపాయలుగా ఉన్న మోటో ఎం స్మార్ట్‌ఫోన్‌ ను రూ.12,999కు తగ్గించింది

*మోటో జెడ్‌2 ప్లే స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.29,499 నుంచి రూ.24,999కు తగ్గించింది.

SHARE