DIY SOS mum had to turn off daughter and husband's life support in separate tragedies
mictv telugu

భర్తను, కూతురును చేజేతులా చంపిన మహిళ.. చేతులెత్తి మొక్కాలి!!

June 30, 2022

కన్న కూతురు, కట్టుకున్న భర్త.. ఒకరి తర్వాత ఒకరి మరణం ఆమె జీవితంలో సంతోషాన్ని దూరం చేసింది. తన కళ్ల ముందు వాళ్లు లేకపోయినా వారి అవయవాలను దానం చేసి మరికొందరికి జీవితాల్లో వెలుగులు నింపేలా మంచి నిర్ణయం తీసుకుంది. యూకేకు చెందిన కరోలిన్.. తాజాగా ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్ని తెలపడంతో అది కాస్తా సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది. 2007వ సంవత్సరంలో వాళ్ళ ఇంటి గ్యారేజీలో ఓ అల్మారాకు ఢీకొని తన ఏడేళ్ళ కూతురు నటాషా గాయపడింది. చిన్న దెబ్బే కదా అని త్వరగా కోలుకుంటుందిలే అనుకున్నారు. కానీ ఆమె పరిస్థితి రెండోరోజుకు క్షీణించింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో రెండు రోజుల తర్వాత నటాషా లైఫ్ సపోర్ట్‌ను కరోలిన్ తీసేయాల్సి వచ్చింది. అలా కూతురు నటాషా ఆసుపత్రిలోనే మరణించింది.

కూతురి మరణం తర్వాత కరొలిన్ భర్త పాల్ ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది. నటాషా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ , పదే పదే ఏడుస్తూ, మనసులోనే మూగగా బాధపడేవాడు. ఇలా ఆందోళన, నిద్రలేమి సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురై 2016లో గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. పది రోజులపాటు లైఫ్ సపోర్ట్ మెషీన్‌లో ఉంచారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లైఫ్ సపోర్ట్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చిందని కరోలిన్ తన బాధను పంచుకుంది. అయితే వారిద్దరి విషయంలోనూ కరోలిన్ ఓ మంచి పని చేసింది. అవయవ దానం చేసి వారు ఈ లోకంలో లేకున్నా.. వారి వల్ల ఇంకొందరు ప్రాణాలతో బతికి ఉన్నారన్న భావిస్తూ.. కాస్తో కూస్తో సంతోషాన్ని ఆమె మిగుల్చుకోగలిగింది. తనకు ఈ లోకంలో మిగిలిన ఏకైక బంధమైన కుమారుడే లోకంగా కరోలిన్ బతుకుతోంది.