అల్లు అర్జున్ ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ సినిమాలోని ‘గుడిలో బడిలో..’ అనే పాటను విడుదల చేశారు. ఇది రుద్ర స్తోత్రాన్ని కించపరిచేలా ఉందని బ్రాహ్మణ, హిందూ సంఘాలు ఆరోపించాయి. రుద్ర స్తోత్రంలోని వాక్యాలను యుగళగీతానికి వాడారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. చిత్ర నిర్మాతలు రుద్ర స్తోత్రానికి ఉన్న విలువను తగ్గిస్తున్నారని మండిపడ్డాయి.