హైకోర్టులో డిజె ? - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టులో డిజె ?

June 27, 2017

మన సంసృతీ సాంప్రదాయాల మీద తెలుగు సిన్మోళ్లకు ఎంత గౌరవం ఉందో ఈరోజుల్లో వచ్చే సినిమాలను చూస్తే బాగా అర్ధమవుతుంది,సినిమా వసూళ్లలో రికార్డులు కాదు,కోర్టు మెట్లు ఎక్కుట్ల కొత్త రికార్డులు సృష్టిస్తున్నయ్,మొన్నచ్చిన డిజె అదే దువ్వాడ జగన్నాథం సిన్మగుడ వరుస వివాదాల్లో కొత్త కొత్త రికార్డులు బద్దలు కొట్టుకుంటూ ఆఖర్కి హైకోర్టు మెట్ల దగ్గర ఆగింది.

హిందువుల మనోభావాలను దెబ్బతీసారంటూ  చాలా పోలీస్టేషన్లో ఫిర్యాదులు వచ్చాయి,ఇదివర్కే బ్రాహ్మణులందరూ కూడా యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించాలంటూ దర్నాలు చేసారు,దానికి చిత్రయూనిట్ కాడా సరేనంది,కానీ ఆవిషయాన్ని లైట్ తీస్కుంది,కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసు హైకోర్టు వరకు వెళ్లింది, అభ్యంతకర సన్నివేశాలు తొలగించేదాక థియేటర్లలో డీజే ప్రదర్శన నిషేధం విధించేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టును కోరారు.కోర్టు కూడా…చిత్రాన్ని పరిశీలిస్తామని ..దీనిపై విచారించి తగిన నిర్ణయం తీసుకుంటామని వచ్చేవారానికి కేసును వాయిదా వేసింది.ఇగ కొందరేమో..ఆ.. ఈకేసు నడిచి తీర్పు వచ్చే సరికల్లా దాని 100 డేస్ ఫంక్షన్ కూడా ఐపోతుంది,అప్పుడు ఏం యాక్షన్ తీస్కున్నా ఏం లాభం అని గుస గుస పెట్టుకుంటున్రట.