హరీష్..తప్పు నీది కాదు..అంతా సభ్యసమాజనిదే..! - MicTv.in - Telugu News
mictv telugu

హరీష్..తప్పు నీది కాదు..అంతా సభ్యసమాజనిదే..!

June 28, 2017

ఈ టైటిల్ చూస్తే మీకు కోపం రావొచ్చు. కానీ అబ్బబ్బ రెండేళ్లు కష్టపడి హరీష్ తీసిన సినిమా డీజె. దాని గురించి కొంచెమైనా ముచ్చటించుకోవాల్సిందే. రివ్యూ గివ్యూ ల దగ్గరికి వెళ్లడం లేదు..హరీష్ ను అస్సలు విమర్శించడం లేదు. అన్ని నమ్మి వదిలేసిన దిల్ రాజు ను అనడం లేదు. మరి ఎవర్నీఅనాలి సభ్య సమాజాన్నే. అవును అనాల్సిందే.. డీజే కి సభ్య సమాజానికి లింక్ ఏంటీ…?తీసినోడ్ని వదిలేసి సమాజం పై పడ్డారేంటానుకుంటున్నారా..? అక్కడికే వెళ్దాం.

రెండేళ్లు అంటే మస్తు టైమ్..ఇంచుమించు బాహుబలి పార్ట్ వన్ అంతా.అందుకే డీజే డైరెక్టర్ హరీష్ కు స్క్రిప్టు రాసే పనిలో బోలెడు సమయందొరికింది.

మధ్య మధ్యలో బూతుల ప్రొగ్రామ్ జబర్దస్త్ షో చూసినట్టు ఉన్నారు. ఒకటి, రెండు కాదు దాదాపు డజన్లకొద్దీ. వీటి రేటింగ్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. జనం మస్తుగా ఆదరిస్తున్నారు అనుకున్నట్టు ఉన్నాడు. నిద్ర పట్టక బూతుల బాట నడిచాడు.

“ఒక్కడ్నే ఎంతకాలమని సెల్ఫీ కొట్టుకుంటాను…కాళ్లకు సాక్సులే వేసుకోను…ఇలా టోటల్ సినిమాలో బూతుల పంచ్ లే. ఉడతలు పట్టే ఈ సినిమాకు ఇన్ని ఎఫైర్లు సెటైర్లా…నీ సినిమా ఇష్టం..డబ్బులు దిల్ రాజు ఇష్టం..కానీ చూసేది జనం. ఈ పాయింట్ మర్చిపోతే ఎలా హరీషూ.. స్వరం తప్పకుండా వేదాలు వల్లించావు వోకే ..సభ్య సమాజానికి అన్నీ అభ్యంతరకర మాటలు,దృశ్యాలు ఏంటీ. ఒక్కమాటలో చెప్పాలంటే బూతు..బూతస్యా.. బూతో బూతోభ్యహ

చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప..మనిషి కనపడాల్సిన పనిలేదు.నిజమే కానీ నువ్వు తీసిన సినిమాలో బూతుల పంచ్ లు తప్ప మరేమి కనిపించవు. జనానికి వినిపించడమూ లేదు. హీరోయిన్ పూజా హెగ్డే అంటే నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నువ్వు చూస్తే ఆమె అందాల్ని చూసుకో..మరి ఆమె బాడీ అంతా కనిపించేలా జనానికి చూపించడం ఏంటీ.. ఈ హెవీ ఎక్స్ పోజింగ్ కథకు సపోర్ట్ చేస్తుందా.. అదీ లేదు. హీరోయిన్ ను కనీసం హీరోయిన్ గా చూపించలేదు. ఈమె కన్నా బాలీవుడ్ లో అప్పడప్పుడు డ్రెస్సుల్లో మెరిసే సన్నీలియోన్ బెటర్. సినిమాను సినిమాగానే చూద్దాం…కనీసం పెళ్లిలో సీన్లు తీసేప్పుడైనా సోయి లేదా…ఎవరో వంటోడు.. కాపీ మంచిగా చేస్తే ..నచ్చితే అమ్మాయి పబ్లిక్ గా ముద్దు ఇస్తుందా..నువ్వు రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూశావా..కనీసం సీన్ పెడితే పెట్టావు కానీ మరి పెళ్లి వేడుకలో..పది మందిముందా… ఇలాంటి బూతులు, సీన్లు ఉన్నా సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చూస్తారని ఎలా అనుకున్నారు.

దిల్ రాజు అంటే మినమం గ్యారంటీ మూవీ. ఎంటర్ టైన్ మెంట్ లోనైనా , రెవెన్యూలోనైనా ఇంతే. అల్లు అర్జున్ అంటే స్లయిలిష్ మూవీస్ కు కేరాఫ్.ఇక హరీష్ తీసింది అరడజన్ సినిమాలే అయినా మంచి క్రేజ్ ఉంది. మరి ఈ బిల్డప్.. ఈ ఎలివేషన్ … ఈ ఇంట్రడక్షన్ ఎక్కడ దొబ్బంది. దిల్ రాజు నీకేమైంది. అనుకోని సంఘటనల బాధలో మీరు ఉండొచ్చు..కానీ మీ సినిమాలంటే జనంలో ఓ క్రేజ్ , ఇమేజ్ ఉంది అని మర్చిపోయారా…అలా హరీష్ ని నమ్మి ఎలా వదిలేశారు…?జబర్దస్త్ షో ను కంబైన్డ్ గా చూశారా ఏంటీ…?

మాకు ఎంటైన్ మెంట్..మీకు రెవన్యూ…అయితే వోకే… కానీ లెక్క సరిపోలేదు. ఇలా తీస్తే బాక్స్ ఫీసు దగ్గర ఎప్పటికీ నిలువలేరు.వాష్ వాష్ ఫుల్ వాష్ …హ్యాండ్స్ కాదు బ్రెయిన్. మీరు బావుండాలి..సినిమా బావుండాలి. మీ సినిమా గుర్తుగా సాంబర్ మరిగినట్టు జనంలో మరిగిపోవాలి. ఆహా కన్ ఫ్యూజన్ వద్దండి..చిప్ లు దొరికాక బూతులు దొరికాయో…బూతులు దొరికాక చిప్ లు దొరికాయో తెలియదు…చూసీ చూడకనకే జనం ఛీ కొడతారు.

డోంట్ వర్రీ రాజా… ఈ జన్మకిది చాలు..మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయకు ..నీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడా బూతులు లేవు..మరి డీజే విషయంలో ఏమైంది. ఇప్పటికైనా పోయిది కొంచెం పరువే అయినా మంచి ఫ్యూచర్ ఉంది. టాలెంట్ కు పదును పెట్టండి.మైక్ చేతిలో ఉంది అని వాగేయకండి..ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకోకండి.. ఈ సారి బూతులేకుండా మంచి కథతోనే డైరెక్ట్ గా డైరెక్షన్ చేయండి… బెటర్ లక్ నెక్ట్స్ టైమ్.