dj tillu director vimal krishna about fight with hero siddu jonnalagadda
mictv telugu

స్టార్ హీరోతో సినిమా చేస్తా.. కానీ సిద్ధు మాత్రం వద్దు

November 10, 2022

ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్‌లో డిజె టిల్లు ఒకటిగా నిలిచింది. దాంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ డీజే టిల్లుకి సీక్వెల్‌ గా డీజే టిల్లు స్క్వేర్ ని ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ కి డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విమల్ కృష్ణ, హీరో సిద్దు జొన్నలగడ్డ మధ్య సంబంధాలు అంతా బాగాలేవని ఊహాగానాలు వచ్చాయి. డిజె టిల్లు విజయానికి సిద్దూ క్రెడిట్ మొత్తం తీసుకున్నందుకు విమల్ కృష్ణ అసంతృప్తిగా ఉన్నాడని పుకార్లు కూడా ఉన్నాయి. ఇద్దరిమధ్య ఇగో క్లాష్ ని సృష్టిచిందన్న వదంతులపై దర్శకుడు విమల్ కృష్ణ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విమల్ కృష్ణ మాట్లాడుతూ.. తనకు సిద్దూతో లేదా మేకర్స్‌తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పి అన్ని పుకార్లను కొట్టిపారేశాడు.

డీజే టిల్లు సీక్వెల్ చేయకపోవటానికి కారణం చెప్తూ.. మరోసారి అదే క్యారెక్టర్‌పై వర్క్‌ చేయడంలో ఎగ్జైట్‌మెంట్ లేదని అన్నారు. కొత్తరకమైన పాత్రతో.. ఊహించని కథాంశంతో సిద్దూతో కలిసి పని చేస్తానని చెప్పాడు. తాను కొన్ని సాలిడ్ స్క్రిప్ట్స్‌పై పని చేస్తున్నానని, తన తదుపరి సినిమా కోసం కొంతమంది పెద్ద స్టార్ల తో చర్చలు జరుపుతున్నానని చెప్పాడు. అయితే నిజానికి.. తనకి టీమ్‌కు మధ్య కొన్ని విభేదాలు ఉంటే తప్ప, ఏ దర్శకుడైనా బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని వదులుకోడు.. కానీ విమల్ డీజే టిల్లు సీక్వెల్‌ ని వదులుకోవడం కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. ఏదేమైనా దర్శకుడు విమల్ కృష్ణ DJ టిల్లు లాంటి మరో బ్లాక్‌బస్టర్‌ను అందించాలని ఆశిద్దాం.