హరీషూ..ఎందుకయ్యా..అంత బిరుసూ... - MicTv.in - Telugu News
mictv telugu

హరీషూ..ఎందుకయ్యా..అంత బిరుసూ…

July 6, 2017

అర్రే గీనకు ఏమైంది. డీజే వచ్చినకనుంచి గయ్ గయ్ చేస్తుండు.ఏదేదో మట్లాడుతుండు.. పొద్దున లేస్తే పంచ్ లేస్తుండు. ఎ హరీషూ…బుర్ర వేడెక్కిందా ఎంది..ఏదేదో అరుస్తున్నవ్..బాలయ్య లాగ తొడగొట్టడమే తక్కువన్నట్టుంది.కొంపదీసి బాలయ్య పూనిండ ఎంటీ..?

డీజే వచ్చినంక పబ్ ల్లో పగిలే సౌండ్ చేస్తడనుకుంటే…మీడియా ముందు రీ సౌండ్ వినిపిస్తుండు హరీష్ శంకర్. ఇంతకు ఏమన్నడో ఎరుకేనా..డీజే: దువ్వాడ జగన్నాథమ్‌ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిందట. నైజాంలో ‘డీజే’ రూ. 20 కోట్లు వసూలు చేసిందని, ఇక్కడ రూ. 20 కోట్లు దాటిన బన్ని తొలి చిత్రమిదేనని పీఆర్వో ట్వీట్‌ చేసిండు. హరీష్‌ శంకర్‌ సిత్రాల్లో నైజాంలో రూ. 20 కోట్లు కమాయించిన రెండో సిత్రమిదన్నారు వోకే. ఈ ట్వీట్‌ను హరీష్‌ రీ ట్వీట్‌ చేసిండు. చేస్తే చేసుకోని.. చెపితే సెప్పుకోని. రాజుగారికి పెట్టిన పైసాలొచ్చాయ్..నీ పై నమ్మకం అలాగే ఉంటది. ఇంకేంది ఇలా ఖుషీ గాక..వెబ్ సైట్లు, గీబుసైట్లు అంటూ గబ్బు గబ్బు మ్లాట్లాడుతుండు. నైజాంలో 20 కోట్లు రాలేదని సుపతి చేస్తే…సిత్రాలు తీయనని సవాల్ విసిరుతుండ్రు. లేకపోతే వాళ్లు వెబ్ సైట్లు మూసేయాలంటుండు. అరె గిదనితోనే ఆగలే.. యుద్ధం శరణ గచ్చామి అంటుండు.ఆ..హ…హరీష్ అంటే ఎందనుకుంటున్నారు..గింతే..
కాదు..

గబ్బర్ సింగ్ గురించి ఎత్తెత్తి రాస్తే ఖుషీ ఖుషీ అయితివి…సప్పుడు చేయకపోతివి. సుబ్రమణ్యం ఫర్ సేల్ సూపర్ అంటే కాలరేగిరేసితివి. మరి బాలేనప్పుడు బాలేదంటే ఉలుకు ఎందుకయ్య..అవేవో వెబ్ సైట్లు రాస్తే.. డీజేలో దమ్ముంటే వసూళ్లు ఆగవు కదా..వచ్చినవి..మరి నోటికి ఎదొస్తే అది సోయి లేకుండా మాట్లాడుతావేంటయ్యా..హరీషూ..ఎందుకయ్యా..నీకు అంతా బిరుసూ…

ఎదిగిన కొద్ది ఒదగమని సినిమాలొళ్లే సెప్పిండ్రు..మల్లొక్కసారి విను..మారు..మంచిగా మారు..తీసింది అరడజన్ సినిమాలే…ఆరవై కళలు లాగ నువ్వు ఆరవై సినిమాలు తీయాలి.ఒక్కదానికే ఆగమాగం అయితే ఎట్ట..ఒక్క సినిమా బాగా ఆడకపోతే దిల్ రాజు నమ్మరా ఎంటీ..గయ్ గయ్ కాకు ..ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్..20 కోట్లు వచ్చినవి కదా..పండుగ చేస్కో…పరేషాన్ కాకు కాకా..