డీఎల్ఎఫ్ గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. 91 యేండ్ల కుశాల్ పాల్ సింగ్ భార్య 2018లో చనిపోయింది. ఒంటరితనంతో ఉన్న ఆయన నిరాశలో కూరుకుపోయాడు. ఇప్పుడు మళ్లీ తను చలాకీగా పనిలో నిమగ్నమయ్యాడు. ముసలి వయసులో కచ్చితంగా ఒక తోడు కావాలంటున్నారు
మానసిక నిపుణులు.
సింగ్ భార్య ఇందిర క్యాన్సర్ తో మరణించింది. దీంతో పాల్ తన వ్యాపారం నుంచి వెనకడుగు వేశాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఒంటరితనం ఆయన్ని కుదిపేసింది. అయితే ఇప్పుడు షీనా అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని ప్రకటించారు. తను ఎఫ్పుడైనా తను తక్కువగా ఫీల్ అయితే ఆమె తనను ముందుకు తీసుకెళుతుందని చెబుతున్నాడు సింగ్.
వృద్ధుల్లో ఒంటరితనం..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ ప్రకారం.. వృద్ధులు ప్రత్యేకించి ఎక్కువగా ఒంటరితనానికి ఫీలవుతుంటారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. వృద్ధాప్యంలో పురుషులు లేదా మహిళలు ఈ కింది కారణాల వల్ల ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది.
– వయసు పెరుగడం లేదా ఆరోగ్యం బలహీనపడడం
– రిటైర్మ్ మెంట్ అయి ఫ్రీ లైఫ్ గడుపాలనుకోవడం..
– జీవిత భాగస్వామి చనిపోవడం వల్ల..
– వైకల్యం లేదా అనారోగ్యం వల్ల..
– కుటుంబం వారిని వద్దనుకోవడం..
ఈ కారణాల వల్ల డిప్రెషన్, ఒంటరితనం, ఆందోళన, శారీరక ఆరోగ్య క్షీణతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే.. అంత ఒంటరిలోనూ చాలామంది ఇతరుల సహాయం కోరుకోరు.
శృంగారం ఎలా..?
ఒంటరితనం అధిగమించడానికి స్నేహాలకు అతీతంగా వృద్ధుల మధ్య శృంగార సంబంధాలు ఉంటే జీవితాలు అనేక విధాలు మెరుగపడుతాయంటున్నారు నిపుణులు.
– దీర్ఘకాలికంగా ఒంటరిగా ఉండడం వల్ల శారీరక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి శృంగారం ఒక మందులా పని చేస్తుందంటున్నారు నిపుణులు.
– శృంగార సంబంధాలు కూడా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి. ఇలా గడిపిన వృద్ధుల్లో పగటిపూట కార్టిసాల్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు.
– శారీరక ఆప్యాయత అనేది ఎంతో విశ్రాంతినిస్తుంది. దీనివల్ల రక్తపోటు, ఆక్సిటోసిన్ స్థాయిలు తగ్గుతాయి. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్స్ చాలా మేలు చేస్తాయి.
– పెద్దలు కచ్చితంగా డేట్ కి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవాలి. దినచర్యను మార్చుకొని ఒకరికోసం ఒకరు ఉన్నామంటూ బాసలు చేసుకుంటే అంతా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు.
improve mental health