లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎన్నో వ్యాపార సంస్థలకు నష్టాలు వస్తున్నాయి.అయితే ఈ విపత్కర సమయాల్లో కూడా లాభపడ్డ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు డీమార్టు అధినేత రాధాకిషన్ ధమానీ.
ఆయన స్థాపించిన సూపర్ మార్ట్స్ లిమిటెడ్ సంస్థ (డీ మార్ట్ సూపర్ మార్కెట్లు) సంస్థ కరోనా సమయంలో కూడా లాభాల్లో నిలుస్తోంది. దేశంలో ఎందరో వ్యాపారవేత్తలు నష్టాలను చవిచూస్తుంటే.. ఈ ఏడాది రాధాకిషన్ సంపద విలువ మాత్రం 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్లో తొలి 12 మంది అపర కుబేరుల్లో లాభాలబాటపట్టిన ఓకే ఒక వ్యక్తి రాధాకిషన్. ముఖేశ్ అంబానీ, ఉదయ్ కోటక్ వంటి దిగ్గజ వ్యాపారుల సంపదలో 32 శాతం కరోనా దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. రాధాకిషన్ మాత్రం లాభాల బాట పట్టారు. లాక్ డౌన్ కారణంగా అధిక శాతం ప్రజలు ఎక్కువగా నిత్యావసరాలను కొనడమే ఇందుకు కారణం.