విజయ్‌కాంత్‌కు కరోనా.. - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్‌కాంత్‌కు కరోనా..

September 24, 2020

vijan

కరోనా మహమ్మారి సినీ, రాజకీయ రంగాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రముఖులు ఒకరి తరువాత మరొకరు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని మియోట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

‘విజయకాంత్‌కు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు.’ అని మియోట్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ పృథ్వీ మోహన్‌దాస్ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌‌లో తెలిపారు. అలాగే డీఎండీకే పార్టీ కూడా విజయకాంత్‌కు కరోనా సోకిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్‌ హెల్త్ చెక్ అప్ కోసం‌ మియోట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ జరిపిని కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్దారణ అయిందని డీఎంకే పార్టీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.