ఇది ఇండియానా? ‘హిందియా’నా?.. స్టాలిన్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇది ఇండియానా? ‘హిందియా’నా?.. స్టాలిన్ ఫైర్

August 12, 2020

DMK Chief Stalin Angry In Hindi

హిందీ భాష మాట్లాడకపోవడంతో తన సోదరికి ఎదురైన చేదు అనుభవంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయుడు అయినంత మాత్రాన హిందీ రావాలా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇది ‘ఇండియానా లేక హిందియానా’ అంటూ సెటైర్ వేశారు. ఇండియన్ అని నిరూపించుకోవడానికి హిందీ కోలమానమా అని అడిగారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఉత్తరాధి భావజాలంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కనిమొళి ఇటీవల ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా ఓ సీఐఎస్ఎఫ్ అధికారి ఎంక్వైరీ సమయంలో హిందీలో మాట్లాడాలని కోరాడు. అయితే తనకు రాదని చెప్పడంతో నువ్వు ఇండియనేనా అని ప్రశ్నించాడు. దీనిపై కలత చెందిన ఆమె వెంటనే కౌంటర్ ఇచ్చారు. హిందీలో మాట్లాడితేనే భారతీయుడా అంటూ ప్రశ్నించారు. సీఐఎస్ఎఫ్ పాలసీలో ఏదైనా భాషను రుద్దాలని పెట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఎయిర్ పోర్టులో తప్పనిసరిగా తమిళం లేదా ఇంగ్లీషు మాత్రమే మాట్లాడాలని తమ ప్రజలకు సూచించారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో స్టాలిన్ కూడా స్పందించాల్సి వచ్చింది.