తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను క్రిస్టియన్ అని ఉదయనిధి ప్రకటించారు. తాను ఇలా మాట్లాడితే కొంత మంది బాధపడతారని, వారి కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్లకు ఏమి సమాధానం చెబుతామని అన్నారు.
“నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. నేను ఎగ్మోర్‌లోని క్రిస్టియన్ స్కూల్లో చదివాను, అలాగే చెన్నైలోని లయోలా కాలేజీలో చదివాను. అదే విధంగా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ద్రావిడ ప్రభుత్వ సిద్ధాంతం ఏమిటని అడుగుతున్నారు. హిందు మతానికి చెందిన సంక్షేమ శాఖ మంత్రి శేఖర్‌బాబు ఇప్పుడు క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవులకు కానుకలు అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది ద్రావిడ ప్రభుత్వం అంటే నిదర్శనం ” అని ఉదయ్ నిధి స్పష్టం చేశారు. చెన్నైలోని హరపురం నియోజకవర్గంలోని క్మిస్మన్ వేడుకల్లో తండ్రితో పాటు హాజరైన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.