ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని డీఎంకే ఎంపీ ఎస్. సెంథిల్ కుమార్ అన్నారు. భూమిపూజ, భవనాల ప్రారంభోత్సవాలకు కేవలం హిందూ పురోహితులనే కాక, ఇస్లాం, క్రైస్తవ మతపెద్దలను కూడా పిలవాలని కోరారు. ద్రవిడ సంస్కృతిలో అన్ని మతాలకు స్థానం ఉందని, ఒక మతానికే ప్రాధాన్యమివ్వడం సరికాదని అన్నారు.
ధర్మపురి జిల్లాలో ఓ రోడ్డు ప్రాజెక్టుకు భూమిపూజ జరిపేందుకు వచ్చిన హిందూ పూజారిని అడ్డుకుంటూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవిడ విధానంలో అన్ని మతాలకు చోటు ఉంది. భూమిపూజకు హిందూ మతపెద్దతో నిర్వహిస్తే క్రైస్తవ, ముస్లిం మతపెద్దల మాటేమిటి? అన్ని మతాల వారికిని, చివరికి నాస్తికులను కూడా కలుపుకుపోయేలా మన విధానాలు ఉండాలి. అధికారులు ఈ విషయం తెలుసుకోవాలి’ అని సెంథిల్ అన్నారు. అయితే ఆయన ద్రవిడం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, సీఎం స్టాలిన్ ఇలాంటి కార్యక్రమాల్లో హిందూ సంప్రదాయాలనే పాటిస్తుంటారని విపక్ష అన్నాడీఎంకే విమర్శించింది.
ஒரு அளவுக்கு மேல் என் பொறுமையை சோதிக்கிறார்கள்.
Trying to Keep my cool.
At times they make me to lose my patience. pic.twitter.com/l1gHdhYkQa— Dr.Senthilkumar.S (@DrSenthil_MDRD) July 16, 2022