ఇకపై అలాంటి రోల్స్ చేయను: నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై అలాంటి రోల్స్ చేయను: నయనతార

June 15, 2022

కోలీవుడ్ అందాల తార నయనతార ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో నయనతారకు పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నయనతారలో మార్పు మొదలైందని తమిళ సినీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. ఆమెకు సినిమా కథలు చెప్పడానికి వెళ్తున్న దర్శకులకు, నిర్మాతలకు ఓ కండిషన్ పెడుతోందట. ‘ఇకపై నన్ను సంప్రదించబోయే దర్శక, నిర్మాతలు గ్లామర్ రోల్స్‌ కోసం కథలు కాకుండా, ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో కూడిన కథలతో నా దగ్గరికి రావాలి’ అని కండీషన్‌ పెట్టిందట. అంటే ఇన్నాళ్లు తన గ్లామర్‌తో సినీ ప్రియులను తెగ ఆకట్టుకున్న నయనతార, ఇకపై ఎలాంటి ఎక్స్ పోసింగ్ గాని, తన గ్లామర్‌తో యువతను ఆకట్టుకోవటం వంటి వాటికి పులిస్టాప్ పెట్టిందన్నమాట.

గతకొంత కాలంగా నయనతార విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడిన విషయం బయటపడిన రోజు నుంచి ఇప్పటివరకూ ఆమె గ్లామర్స్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. స్టార్‌ హీరోలతో నటిస్తున్నప్పటికి ఆ సినమాల్లో ఎలాంటి ఎక్స్ ఫోసింగ్, గ్లామర్ రోల్స్‌ విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుని నటించింది. అంతేకాకుండా ఎక్కువ శాతం ఉమెన్ సెంట్రిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ, పలు సినిమాల్లో నటించింది.

తాజాగా పెళ్లి అయిపోవటంతో మరింత వేగం పెంచింది. సినిమాలకు పూర్తిగా దూరం కాకపోయినా, సెలక్టెడ్‌గా మూవీస్ చేయాలనుకుంటోంది. పెళ్లికాక ముందు ఒప్పుకున్న సినిమాలకు మాత్రం ఎలాంటి అబ్జెక్షన్ లేదని తెలిపినట్లు సమాచారం. ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మాత్రమే ఈ కండీషన్స్ అప్లై చేస్తోందని పలువురు దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం నయనతార షారుఖ్ ఖాన్‌తో జవాన్‌, గాడ్ ఫాదర్‌లో చిరంజీవితో కలిసి నటిస్తోంది.