నన్ను అనుసరించొద్దు : కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను అనుసరించొద్దు : కేటీఆర్

April 1, 2022

కేంద్రం విధానాలను, బీజేపీ మతతత్వ ఉద్దేశాలను తాను ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించినప్పుడు ఇబ్బంది పడేవారు ట్విట్టర్‌లో తనను అనుసరించ వద్దని స్పష్టం చేశారు. మరోవైపు మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా అభివర్ణించారు. వాణిజ్య సిలిండర్ ధరను రూ. 250కు పెంచడంతో ఆయన పైవిధంగా ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అంశం ఏప్రిల్ ఫూల్‌లా జోకయి ఉండాలని భావిస్తున్నానన్నారు. కాగా, ఇటీవలే పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లి వచ్చిన కేటీఆర్.. దాదాపు రూ. 8 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొచ్చారు. దీని ద్వారా హైదరాబాద్, తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు వంటి లాభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.