కృష్ణా జిల్లాలో ఆ 6 ఊళ్లకు వెళ్లొద్దు..  - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణా జిల్లాలో ఆ 6 ఊళ్లకు వెళ్లొద్దు.. 

September 25, 2020

nbnbxvb

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసులు, నమోదవుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొత్తగా 6 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఆరు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని తగ్గించాలని కంటైన్మెంట్ జోన్లు ప్రకటించినట్టు ఆయన తెలిపారు. ఈ కంటైన్మెంట్ జోన్లలోకి బయటి వారు వెళ్లకూడదు. అలాగే, కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారు బయటకు రాకూడదు. వారికి నిత్యావసర సరుకులు అన్నీ స్థానికంగానే అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని, ప్రజలు ఎవరు బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 504 కంటైన్మెంట్ జోన్లలో 2,786 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు.

కృష్ణా జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్లు ఇలా.. 


-వాకనూరు గ్రామం(అవనిగడ్డ మండలం)

-తొర్రగుంటపాలెం గ్రామం(జగ్గయ్యపేట మండలం)

-కోర్లమంద గ్రామం(విస్సన్నపేట మండలం)
-లక్ష్మీపురం గ్రామం(చల్లపల్లి మండలం)
-తోటరావులపాడు గ్రామం(చందర్లపాడు మండలం)
-షబ్ధుల్లపాలెం గ్రామం(గూడూరు మండలం)

కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించిన గ్రామాలు ఇలా.. 

 గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించినట్లుగా కలెక్టర్ తెలిపారు.

 

-ముచ్చినపల్లి గ్రామం (రెడ్డిగూడెం మండలం)
-కొడాలి గ్రామం(ఘంటసాల మండలం)
-దొండపాడు గ్రామం(గుడివాడ మండలం)
-పురిటిపాడు గ్రామం(గుడ్లవల్లేరు మండలం)
-మంగినపూడి గ్రామం(మచిలీపట్నం మండలం)
-టీచర్స్ కాలని(మచిలీపట్టణం మున్సిపాలిటీ)
-దాసుళ్ళపాలెం గ్రామం(మైలవరం మండలం)
-ఐతవరం గ్రామం(నందిగామ మండలం)
-శ్రీరాంపురం గ్రామం(రెడ్డిగూడెం మండలం)