అప్పులు చేయకండి.. శ్రీలంకల కాకండి: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

అప్పులు చేయకండి.. శ్రీలంకల కాకండి: కేంద్రం

April 4, 2022

03

శ్రీలంక దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అప్పుల మీద అప్పులు చేయడంతో శ్రీలంక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ధరలు భారీగా పెంచారు. దీంతో జనాలు ఏం కొనే పరిస్థితి లేక, ఏం తినే పదార్థాలు దొరకాక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది దేశాన్ని విడిచిపోతుంటే, మరికొంతమంది సరుకుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది శ్రీలంక అధ్యక్షుడి భవనం వద్ద ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే, భారత ప్రభుత్వం పలు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుల మీద అప్పులు చేయకండి-శ్రీలంక దేశ పరిస్థితి తెచ్చుకోకండి అంటూ హెచ్చరించింది.

అంతేకాకుండా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సీనియర్ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉన్నా, అప్పులు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాయని..ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్నారు. ఇలాగే, కొనసాగితే శ్రీలంక తరహా ఆర్ధిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తధ్యమని అధికారలు సూచించారు.

ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి. కె. మిశ్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి కుంటుపడటానికి పేదరికాన్ని సాకుగా చూపుతూ, చెప్పే పాత కథలను అధికారులు మానుకోవాలి. భారీ అభివృద్ధి పథకాలను అలక్ష్యం చేయొద్దు’ అని పేర్కొన్నారు.