ఈ రోజుల్లో చాలామంది…ఏ పనిని ప్రారంభించిన వాస్తును పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణం నుంచి ఇంటీరియర్ వరకు వాస్తును చూస్తున్నారు. వాస్తు ప్రకారం గృహోపకరణాలు ఉంచుకోకపోతే ఆర్థికంగా నష్టపోతారని, ఇంట్లో సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఇంటి దక్షిణ దిశ గురించి చెప్పుతుంది. ఇంటి దక్షిణ దిశ గురించి వాస్తు శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం.
ప్రధాన ద్వారం తూర్పు లేదా ఈశాన్యంలో ఉండాలి:
ఇంటి ప్రధాన గుమ్మం ఎప్పుడూ కూడా ఈశాన్య లేదా తూర్పు దిశలోనే ఉండాలి. దక్షిణ దిశలో ఉండకూడదు. మీ ఇంటి ముఖద్వారం దక్షిణ దిశలో ఉన్నట్లయితే…ప్రవేశ ద్వారం వద్ద మూడు వాస్తు పిరమిడ్లను ఉంచండి. ఇది నెగెటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంటి ముఖ ద్వారం సరైన దిశలో లేనట్లయితే కుటుంబంలో అశాంతి, అనారోగ్యానికి ప్రధాన కారణం అవుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఓం, త్రిశూల్, స్వస్తిక్ ఉంచండి. ఈ త్రిమూర్తులు ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా నిరోధిస్తాయి.
పూజగది:
ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో…పూజగది కూడా అంతే ముఖ్యం. ఇంట్లో ఆనందం, శాంతి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేందుకు పూజా గృహాన్ని నిర్మిస్తారు. అయితే ఇంటికి దక్షిణ దిశలో పూజా మందిరాన్ని నిర్మించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ దిశలో పూజ గది ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది.
స్టోర్ రూం:
ప్రతిఇంటికి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. అందులో మనకు అవసరం లేని వస్తువులను ఉంచుతాం. స్టోర్ రూం ఇంటికి దక్షిణ దిశలో ఉండకూడదు. దక్షిణ దిశలో స్టోర్ రూం ఉంటే పూర్వీకులను అవమానించినట్లవుతుందని శాస్త్రం చెబుతోంది.
పడక గది:
పడకగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన పడకగది ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. దక్షిణ దిశలో బెడ్ రూం ఉండటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.
పాదరక్షల అలమరా:
వాస్తు శాస్త్రాల ప్రకారం, ఇంటికి దక్షిణ దిశలో పాదరక్షాలను ఉంచకూడదు. ఈ దిశలో పెట్టడం వలన జీవితంలో సమస్యలు వస్తాయి. ఇది ఇంటి నాశనానికి దారితీస్తుంది.
తూర్పు దిశలో వంటగది:
ఇంటికి దక్షిణ దిశలో వంటగది ఉండకూడదు. ఈ దిశలో వంటగది ఉంటే సమస్యలు తప్పవు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ దిశలో వంటగది ఉంటే జీవితాంతం సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.