నాపై తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా - MicTv.in - Telugu News
mictv telugu

నాపై తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా

April 6, 2022

rasi

సినీ ప్రియులకు హీరోయిన్ రాశీ ఖన్నా తెలియని వారుండరు. తెలుగులో మనం, ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, బెంగాల్ టైగర్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి వివిధ చిత్రాలు చేశారు. అయితే, తనకు ఎంతో ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమపై ఇటీవలే రాశీ ఖన్నా ”దక్షిణాది సినిమాలు రొటీన్‌గా ఉంటాయి. హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి, కనుమరుగు అవుతుంది. హీరోయిన్‌కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు” అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

అంతేకాకుండా బాలీవుడ్‌లో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని, ఇకపై తనలో కొత్త నటిని చూస్తారని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడ్డారు. హీరోయిన్‌గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమను విమర్శిస్తావా? అంటూ ప్రశ్నించారు. బాలీవుడ్‌లో అవకాశాలు రాగానే.. సౌత్ ఇండస్ట్రీ చులకన అయిందా? అంటూ నిప్పులు చెరిగారు. దీంతో రాశీఖన్నా స్పందించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను తాను దూషించానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అని రాశీ ఖన్నా అన్నారు. ఏ చిత్ర పరిశ్రమ అయినా, తాను చేసే ప్రతి సినిమాపై తనకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరింది.