Do not travel in metro trains with tapas
mictv telugu

hyd మెట్రోలో ఆ వస్తువులపై నిషేధం విధించిన సంస్థ

October 21, 2022

Do not travel in metro trains with tapas

ట్రాఫిక్ కష్టాలు పడలేక చాలా మంది హైదరాబాద్ నగర వాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో క్రమంగా రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పునస్కరించుకొని మెట్రో సంస్థ ప్రయాణీకులకు ఓ సూచన చేసింది.

టపాసులు కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించడంపై నిషేధం విధించింది. నిబంధనల ప్రకారం పేలుడు పదార్ధాలు తీసుకెళ్లడం నిషేధమని, ఇలాంటి పదార్ధాల వల్ల మెట్రో వ్యవస్థతో పాటు సిబ్బంది, ఇతర ప్రయాణీకులకు ప్రాణహాని ఉంటుందని పేర్కొంది. నగరవాసులు పండుగ సందర్భంగా షాపింగ్ చేసేటప్పుడు టపాసులు కొనడం సాధారణమని, కానీ, దయచేసి వాటిని మెట్రోలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంట్రీ పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.