do not use antibiotics repeatedly for cough says ICMR
mictv telugu

దగ్గుమందులు వాడేవారికి ప్రభుత్వ హెచ్చరిక…

March 4, 2023

do not use antibiotics repeatedly for cough says ICMR

దగ్గు వచ్చినా, జలుబు చేసినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే దగ్గుమందులను, యాంటీబయాటిక్స్‏ను వాడటం ఈ మధ్య కామనైపోయింది. అయితే ఇలా ఇష్టానుసారంగా మందులు వాడేవారికి ప్రభ్వుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దగ్గు, జలుబు, వికారం వంటి లక్షణాలు కలిగిన వారు ఎవరిని సంప్రదించకుండా యాంటిబయాటిక్స్ వాడవద్దని వీటిలో చాలా కేసులు ఇన్‏ఫ్లుయెంజా ఏ సబ్‏టైప్ హెచ్3ఎన్ 2 వైరస్‏కు కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా వెల్లడించింది.

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా దగ్గుతో దీర్ఘకాలం బాధపడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్యతో హాస్పిటల్ లో చేరిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒకసారి మొదలైన దగ్గు దాదాపు 15 రోజులకుపైగానే వేధిస్తుండటంతో ప్రజలు ఆ బాధ నుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్‏ను విపరీతంగా వాడుతున్నారు. అయితే ఈ నాన్ స్టాప్ దగ్గు హెచ్3ఎన్2 అనే వైరస్ కారణంగా వస్తోందని తాజాగా ఐసీఎంఆర్ వెల్లడించింది. అందుకే దగ్గును నివారించడానికి విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచించింది. వారం తరువాత ఇన్‏ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోతుందని తెలిపింది. విపరీతంగా మందుల వాడకం వల్ల దీర్ఘకాలంలో అవి పనిచేయకుండా ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది.