తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సొంత రాష్ట్రం ఏదో తెలుసా అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలను అనుమానిస్తుండు. అవమానిస్తుండు. ప్రశాంత్ కిశోర్, సోమశ్ కూమార్, అరవింద్ కూమార్, అంజనీ కూమార్, సందీప్ కూమార్ ఇలాంటి బీహార్ ముఠాతోటీ కేసీఆర్ ఎందుకు జంటకట్టిండో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా దీనికి గల కారణాలు, మూలాలను చూడండి. కేసీఆర్ డీఎన్ఎను చెక్ చేయండి. కేసీఆర్ ముతాత్తలు బీహార్ నుంచి తెలంగాణకు వలస వచ్చారు. ఈ విషయం నేను చెప్పలేదు. 2008లో ఓ ప్రముఖ ఛానెల్కీ ఇచ్చిన ఇంటర్య్వూలో స్వయంగా కేసీఆరే చెప్పిండు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోపక్క ఆదివారం ప్రగతి భవన్ గేట్లు బద్ధలు కొట్టి, 2 లక్షల ఉద్యోగాలు వేయిస్తా అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య రసవత్తరంగా మాటల యుద్ధం జరుగుతోంది.