భూమిపై బతికే చేపల గురించి మీకు తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

భూమిపై బతికే చేపల గురించి మీకు తెలుసా?

May 24, 2022

చేపలంటే నీటిలోనే బతుకుతాయని మనకు తెలుసు. కానీ నేలపై బతికే చేపల గురించి శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. బ్లెన్నీస్ అని పిలిచే ఈ చేపలు అలల కారణంగా ఒడ్డుకు కొట్టుకువచ్చి క్రమంగా నేలపై జీవించడం నేర్చుకున్నాయి. సముద్రం అట్టడుగున నివసించే ఈ చేపలు అక్కడ నీటిలోనే కొన్ని బొరియలు చేసుకొని జీవిస్తాయి. ఆ అనుభవంతో నేలపై కూడా బొరియలు ఏర్పాటు చేసుకొని క్రమేణా జీవించడం మొదలుపెట్టాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే నేల మీద ఎండు ప్రదేశాల్లో కాకుండా నీటితడి ఉన్నచోట తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడైంది. అయితే ఈ జాతుల చేపలు ఎలా నీటిని విడిచి నేల మీదకు చేరుకున్నాయనే సంగతి శాస్త్రవేత్తలకు అంతుబట్టట్లేదు. ఈ మార్పును ఎందుకు కోరుకున్నాయి? అనే విషయంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.