ఈ కాలంలో ఉసిరి కాయలు వచ్చేశాయి. పచ్చళ్లు పెట్టేశారా? అయితే మామూలుగా ఉసిరికాయలను తినేయండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఉసిరి ఇది ఆరోగ్యప్రదాయిని. ఔషధాల గని అంటుంటారు వైద్యులు. ఈ కాలంలో మాత్రమే వచ్చే వీటిని తినడం చాలామంచిది. చాలా వరకు వీటిని పచ్చడి పెట్టడంతోనే సరిపెడుతారు. అలాకాకుండా పచ్చి వాటిని తినడం, జ్యూస్ చేసి తాగడం మరింత మంచిది.
1. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. చలికాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ ఒక ఉసిరికాయ తింటే మంచిది. దగ్గు, జలుబు సమస్యలను రాకుండా చేస్తుంది.
3. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలేకాదు.. అనేక దీర్ఘకాలిక రోగాలకు కూడా ఉసిరికాయ మంచి మందు.
4. జుట్టు రాలే సమస్య ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు, థైరాయిడ్ సమస్యలున్న వారు ఉసిరికాయ జ్యూస్ చేసుకొని తాగడం మంచిది.
5. ఉసిరికాయ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీంట్లో జీడిపప్పు పొడి, తేనె కలిపి తాగితే ఇది ఒక ఔషధంలా పని చేస్తుంది.
6. నోటిపూత సమస్య ఉన్నవాళ్లు ఉసిరి తీసుకోవడం మంచిది. మలబద్దకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన ఈ సమస్య తగ్గుతుంది.