సాధారణంగా నడకవల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. భోజనం తర్వాత నడవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ వాకింగ్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. షుగర్ పేషంట్లు రక్తంలో చక్కర స్థాయి పెరగకుండా, తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం తర్వాత కూడా షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. అయితే షుగర్ పేషంట్లకు నడక వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వాకింగ్ ప్లాన్ చెబుతోంది. షుగర్ పేషంట్లు వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలి. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి.
నడక రక్తంలో చక్కెరను తగ్గించగలదా?
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, డయాబెటిక్ రోగులకు చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువ చురుకుగా ఉండే వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. వాస్తవానికి, మీరు ఎంత ఎక్కువ నడుస్తే.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పడిపోతాయి.
చురుకైన వేగంతో నడవడం వల్ల ప్యాంక్రియాస్ కణాలు వేగంగా పని చేస్తాయి.ఈ పద్ధతి చక్కెర జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం నుండి చక్కెరను వేగంగా జీర్ణం చేయడం ద్వారా, రక్తంలో దాని స్థాయి పెరగకుండా నిరోధిస్తుంది. నడక ఎల్లప్పుడూ మీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్‌లో ఎంతసేపు వాకింగ్ చేయాలి
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, రోజుకు 10,000 అడుగులు లేదా కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల మీరు షుగర్‌ని నియంత్రించవచ్చు. మీకు ఒకేసారి 30 నిమిషాలు నడవడం కష్టంగా అనిపిస్తే, రోజంతా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో, ఆహారాన్ని తీసుకోవద్దు. కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు ఉదయం లేదా సాయంత్రం సమయంలో వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఎంత వేగంతో నడవాలో నిర్ణయించుకోండి. ఇలా ప్రతిరోజూ నడక అలవాటు చేసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.