ఉదయం అల్పహారం తీసుకోవడం చాలామందికి అలవాటు. దీంతో రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఉదయం తినే ఇడ్లీ, దోశ, వడ బదులుగా ఈ సూపర్ హెల్తీ షేక్ తాగుతే…ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ అందులో అరటిపండ్లు, ఖర్జూరాలను కలిపి తాగుతే దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. పాలు, అరటిపండు, ఖర్జురాలు సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. దీనిని సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఈ సూపర్ హెల్తీ షేక్ తాగుతే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
రోజంతా తాజాగా ఉంటుంది:
మీరు రోజంతా శక్తివంతంగా ఉండాలంటే, ఉదయాన్నే అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగండి. ఈ పానీయం శరీరానికి బలాన్ని ఇస్తుంది. అలసటను దూరం చేస్తుంది. అలాగే, మీ శరీరం చాలా బలహీనంగా మారినట్లయితే, ఈ పానీయం మీకు సంజీవనిలా పనిచేస్తుంది. నిజానికి, పాలు, అరటిపండు, ఖర్జూరాల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కేలరీలు పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా మీ బరువు సులభంగా పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ అరటిపండు, ఖర్జూరాలను ఒక గ్లాసు పాలతో తీసుకున్నట్లయితే మీరో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
అరటిపండు, ఖర్జూరాలను పాలతో కలిపి తాగడం ద్వారా మీ జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. నిజానికి, వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీని వాడకం వల్ల పొట్టకు చల్లదనం రావడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
పాలు, అరటిపండు, ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు, పాలలో చాలా అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. వీటిని నిత్యం కలిపి తీసుకుంటే అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
రక్తహీనతను నయం చేస్తుంది
అరటిపండు, పాలు, ఖర్జూరంతో తయారుచేసిన షేక్‌ని తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఇది రక్తహీనత వ్యాధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటిపండ్లు, ఖర్జూరాల్లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తాయి.అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని వేగంగా పెంచుతుంది.
ఈ హెల్తీ షేక్ ఎలా తయారు చేయాలి
ఈ షేక్ చేయడానికి, బ్లెండర్లో ఒక పెద్ద కప్పు పాలు తీసుకోండి. ఇప్పుడు 1 అరటిపండు, 2 నుండి 4 నానబెట్టిన సీడ్‌లెస్ ఖర్జూరాలను వేయండి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసి, ఈ హెల్తీ షేక్‌ని తాగండి.