పవిత్ర రంజాన్ మాసం ఈ ఏడాది మార్చి 22 వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 21 వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపావస దీక్షను కొనసాగిస్తారు. సాయంత్రం ఏదైనా అల్పహారంతో ఉపవాసాన్ని విరమిస్తారు. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా పాటిస్తారు. ఈ పవిత్ర మాసాన్ని మతసామరస్యానికి ప్రతీకగా చెబుతుంటారు. అయితే ఈ మాసం మొత్తం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం.
1. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది:
నేడు దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే హెల్త్ లైన్ ప్రకారం ఉపవాసం ఉంటే రక్తంలో చక్కెరను కంట్రోల్ చేసుకోవచ్చని తెలిపింది. హెల్త్ లైన్ తోపాటు ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఉపవాసం సమయంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఉపవాసం చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే మధుమేహం ఉన్నవారు, షుగర్ మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత రంజాన్ ఉపవాసాన్ని పాటించాలి.
2. వాపుతో పోరాడుతుంది:
మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు వాపు వస్తుంది. చాలామంది శరీరంలో మంట ఉంటుంది. గుండెజబ్బు, క్యాన్సర్, రమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారి శరీరంలో మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితు ఉపవాసం వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
3. ఒత్తిడి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి:
నేటికాలంలో ఒత్తిడితో చాలా మంది బాధపడుతున్నారు. అంతేకాదు అదనపు కొవ్వు కూడా వ్యాధులకు కారణం అవుతుంది. దీంతో గుండె సంబంధిత జబ్బులతో మరణానికి కారణం అవుతుంది.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ సమస్య గుండెజబ్బులకు ప్రధాన కారణం. రెగ్యులర్ ఉపవాసం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.
4. మెదడు శక్తిని పెంచుతుంది:
మీ మెదడు శక్తిని పెంచుకోవాలంటే…రంజాన్ ఉపవాసం ఎంతగానో సహాయపడుతుంది. ఉపవాసం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు సరిగ్గా నిర్వర్తించేలా చేస్తుంది. ఉపవాసం సమయంలో మెదడులో నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయి.
5. అధిక బరువు అదుపులో ఉంటుంది:
ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటివారు ఉపవాసం ఉంటే బరువును తగ్గించుకోవచ్చు. నెలపాటు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారికి రంజాన్ మాసం గొప్ప అవకాశం లాంటిది. ఈ మాసంలో ఉపవాసం పాటిస్తే వచ్చి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు. రంజాన్ ఉపవాసం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఎలా బలపరుస్తుందో మీకే అర్థం అవుతుంది.