ఒక్కపోస్టుతో సమంత ఎంత సంపాదిస్తుందో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కపోస్టుతో సమంత ఎంత సంపాదిస్తుందో తెలుసా?

March 28, 2022

sam

పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయి సంపాదన ఉండదని చాలా మంది అభిప్రాయం. కానీ, సమంతు అందుకు విరుద్ధం. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమెకు ఎన్నడూ లేనంత ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలే కాకుండా యాడ్ షూట్ల ద్వారా కూడా సమంత ఎక్కువ సంపాదిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఒక్క పోస్టు పెడితే లక్షల సంఖ్యలో లైక్స్ వస్తాయి. ప్రస్తుతం సమంతకు సినిమాల కంటే యాడ్ల ద్వారానే ఎక్కవ ఆదాయం వస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంటుని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రెండ్రోజులకు ఒక పోస్ట్ పెట్టే సమంత ఒక్కో పోస్టుకు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు తీసుకుంటుందంట. అంటే రోజుకు ఆమె సంపాదన సగటున రూ. 10 లక్షలన్నమాట. ఇది కాకుండా ప్రత్యేకంగా యాడ్ షూట్ చేయాలంటే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. అటు సినిమాల్లో మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. పుష్పలో స్పెషల్ సాంగ్ చేసినందుకు గాను రెండు కోట్లు తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఆ పాట హిట్ అవడంతో బాలీవుడ్ అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయని, అందుకే సమంత ఈ మధ్య ముంబైకి తరచూ వెళ్లి వస్తుందని ఆమె సన్మిహితులు చెప్తున్నారు. ఏది ఏమైనా, సమంత రెండు చేతులా సంపాదిస్తుందని చెప్పవచ్చు. అయితే, సినిమా రంగంలో హీరోయిన్ల జీవితకాలం హీరోలతో పోలిస్తే తక్కువ కాబట్టి, డబ్బులు సంపాదించడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకుల మాట.