బ్యాంకులు లేదా ఏవైనా ఫైనాన్స్ సంస్థలు మనకు లోన్ ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది చూస్తాయి. దానిని బట్టే మనకు లోన్లు ఇస్తాయి. అయితే చాలా మందికి సిబిల్ స్కోర్ ఎలా చూడాలో తెలియదు. అలాంటి వారి కోసం ఈ వార్తా కథనం. 2000లో స్థాపించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిబిల్) లోన్ తీసుకున్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వారు తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని బట్టి రేటింగ్ ఇస్తుంది. సిబిల్ స్కోర్ 700 ఆపైన ఉంగే లోన్ రావడానికి ఈజీగా ఉంటుంది.
అయితే మన సిబిల్ స్కోరు ఎంతుందో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదట అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. https://www.cibil.com లో ఎంటర్ అవ్వాలి. తర్వాత గెట్ యువర్ సిబిల్ స్కోర్ ఆప్షన్ ఎంచుకోవాలి. పేరు, మెయిల్ ఐడీ, పిన్ కోడ్ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సిబిల్ స్కోర్ వస్తుంది. మన స్కోరు ఎంతుందనే దాన్ని బట్టి ఆయా ఆర్ధిక సంస్థలు మనకు రుణాలను మంజూరు చేస్తాయి