పెరుగు, బెల్లం ఈరెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు క్యాల్షియంకూడా పుష్కలంగా ఉంటుంది. బెల్లం కూడా సీజనల్ వ్యాధులను నుంచి రక్షిస్తుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
– బెల్లంలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే శరీరంలో రక్తహీనతకు చెక్ పెడుతుంది. శరీరంలో నుంచి బలహీనతను తొలగిస్తుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే పొట్ట ఆరోగ్యంగా ఉండటంతోపాటు గ్యాస్, ఎసిడిటి సమస్యలు రావు. ఇది ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
-రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో చాలామంది ఇమ్యూనిటీ సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు దీనిని ప్రతిరోజూ తీసుకోవడం చాలామంచిది.
-పెరుగు నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది. అయితే బెల్లం, పెరుగు కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట.
-ఈ రెండింటి కలయిక రక్త ప్రసరణ మెరుగుపడటానికి సాయం చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి. హైపర్ టెన్షన ప్రమాదం నుంచి కాపాడుతుంది
– పెరుగు, బెల్లంలో కాల్షియం మెండగా ఉంటుంది కాబట్టి దంతాలు, ఎముకలు ధ్రుడంగా ఉంటాయి.
-పెరుగు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలు, ఎసిడిటి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
-అంతేకాదు చర్మం, జుట్టుకు పెరుగు చాలా ఉపయోకరంగా ఉంటుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
-నేటికాలంలో చాలామంది అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం, పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ రెండింటిని కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని నిపుణుల చెబుతున్నారు.