Do you know the meaning of the word 'liger'?
mictv telugu

ఇంతకీ ‘లైగర్’ పదానికి అర్ధం తెలుసా?

August 24, 2022

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీగా గురువారం విడుదలవుతోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దాదాపు రూ. 4 కోట్లను వసూలు చేసింది. ముఖ్యంగా నగరాల్లో ఈ సినిమాకు యమ క్రేజ్ ఏర్పడింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు విజయ్ పారితోషికం రూపంలో 25 కోట్లు తీసుకున్నాడని టాక్. పుష్ప, కేజీఎఫ్ రేంజిలో హిట్ అయితే లాభాల్లో వాటా కూడా వస్తుందట. మైక్ టైసన్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ సినిమాలో అనన్యపాండే కథానాయిక. కాగా, చాలా మందికి లైగర్ అంటే ఏంటో తెలియట్లేదు. ఎప్పుడూ వినని కొత్త పదం కావడంతో కొంత గందరగోళానికి ప్రేక్షకులు గురవుతున్నారు. ఇంతకీ లైగర్ పదానికి అర్ధం ఏంటంటే.. పాంథేరా లియో జాతికి చెందిన మగ సింహానికి, పాంథేరా టైగ్రిస్ జాతికి చెందిన ఆడ పులికి పుట్టిన హైబ్రీడ్ జంతువు. అంటే కొందరి ఊహాగానాల ప్రకారం మైక్ టైసన్, రమ్యకృష్ణలకు పుట్టిన విజయ్ దేవరకొండ ఇద్దరి లక్షణాలు పుణికి పుచ్చుకొని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ ఎలా గెలిచాడన్నదే కథాంశమని చెప్తున్నారు. ట్రైలర్‌లో రమ్యక‌ృష్ణ ‘ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్ బీడ్ సార్ నా బిడ్డ’ డైలాగ్ కూడా దీన్ని సూచిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.