ఈవారం థియేటర్/ఓటీటీలో వస్తున్న సినిమాలు తెలుసా! - MicTv.in - Telugu News
mictv telugu

ఈవారం థియేటర్/ఓటీటీలో వస్తున్న సినిమాలు తెలుసా!

April 11, 2022

gdg

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమలు వారం వారం కొత్త సినిమాలను విడుదల చేస్తూ, సినీ ప్రక్షేకులను అలరిస్తున్నాయి. మరోవైపు కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు ఆర్థికంగా దెబ్బతిన్న చిత్ర పరిశ్రమలు.. ఓటీటీ వేదికగా కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ, ప్రక్షేకుల మనసులను దోచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవారం థియేటర్లో రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల నిరీక్షణకు కొన్ని రోజులలోనే తెర తెరపడనుంది. మరి ఈవారం ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా..

1. బీస్ట్..

‘అరబిక్ కుత్తు’ పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘బీస్ట్’. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్గే కథానాయికగా నటించింది. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్.. సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలై, ప్రేక్షకుల మనసులలో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు. ఇందులో విజయ్, మాజీ రా ఏజెంట్ వీర రాఘవన్ పాత్ర పోషించారు. ‘ఈ సినిమాలో ఇప్పటి వరకూ చూడని కొత్త లుక్‌లో విజయ్ కనిపించనున్నారు’ అని దర్శకుడు పలు ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఆ లుక్ ఎలా ఉంటుంది? విజయ్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ఉగ్రవాదుల చెర నుంచి అమాయకపు ప్రజలను ఎలా కాపాడాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

2. ‘కేజీఎఫ్ 2’..

‘కేజీఎఫ్’ సినిమా ఎంతంటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’గా కన్నడ హీరో యశ్..తన డైలాగులతో, నటనతో అదరగొట్టనున్నారు. కేజీఎఫ్‌లో గరుడ మరణానంతరం ఏం జరిగింది? అనే ప్రశ్నకు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2′ ద్వారా సమాధానం ఇవ్వడానికి రెడీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల కానుంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఘన విజయం అందుకోవడం, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

3.’జెర్సీ’..

నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కి, ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం ‘జెర్సీ’. హిందీలో ఇదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రావాల్సి ఉంది. కాకపోతే, ‘కేజీఎఫ్-2’ రిలీ‌జ ను దృష్టిలో ఉంచుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఓటీటీ వేదికగా..
1. ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఏప్రిల్ 14
2. దహనం.. ఏప్రిల్ 14
3. గాలివాన (వెబ్ సిరీస్).. ఏప్రిల్ 14
4. బ్లడీ మేరీ.. ఏప్రిల్ 15 (ఆహా) విడుదల కానున్నాయి.