do you know the ntr high paris seint german shoes cost in japan rrr promotions
mictv telugu

వామ్మో.. జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ షూస్ ధర అంత కాస్ట్లీనా ?

October 24, 2022

కింగ్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా.. నాగార్జున వేసుకునే డ్రెస్ అన్ని లక్షలా.. చిరంజీవి వాచీ ఖర్చుతో మధ్యతరగతి వారు బ్రతికేస్తారా??? ఇలాంటి గాసిప్స్ కొందరికి సిల్లి అనిపించినా అభిమానులను ఆకట్టుకుంటాయి. వారు అభిమానించే హీరోలని అనుకరించే వారైతే ఇలాంటి వార్తలని తెగ లైక్ చేస్తారు. వారి ఫెవరెట్ స్టార్స్ వేసుకునే బట్టలు, గాడ్జెట్స్ లా కనిపించే డూప్లికేట్ మోడల్స్ ని మార్కెట్ లో వెతికి పట్టుకుని వేసుకుంటారు. అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. టాలివుడ్ లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్స్ పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువుంటుంది. ప్రస్తుతం కూడా జపాన్ లో ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ప్రత్యేక చర్చకి తెరలేపుతున్నాయి,

తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ జపాన్ ప్రమోషన్స్ లో బిజి బిజీగా ఉంది. దోస్తీ సాంగ్ పై జపాన్ వీధుల్లో డాన్సులేస్తూ.. అభిమానులతో లంచులు, డిన్నర్లు చేస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు జపాన్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. అయితే ఒక జపాన్ ప్రమోషన్ ఈవెంట్ లో ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ధరపై చర్చ నడుస్తుంది. యంగ్ టైగర్.. ఎయిర్ జోర్దాన్ బ్రాండ్ కి సంబంధించిన 1 హై పారిస్ సెయింట్ జెర్మన్ వేసుకున్నాడు. వీటిని గమనించిన ఫ్యాన్స్ వెంటనే ఈ బ్రాండ్ షూస్ కాస్ట్ ఏంతనేది సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

తారక్ వేసుకున్న ఈ షూ రేటు అక్షరాలా 35 వేలు.. ఈ విషయం తెలిసి అంతా నోరెల్లబెడుతున్నారు. ఇక ఈ మధ్య స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో ఆల్ట్రా పాశ్ గ తయారయ్యాడు ఎన్టీఆర్. తన భార్య ప్రణీతనే దెగ్గరుండీ తారక్ స్టైల్స్, మేకోవర్ సంగతులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ లుక్స్ పై స్పెషల్ పెట్టిన ప్రణీత.. ఎన్టీఆర్ కోసం ఈ కాస్ట్లీ షూస్ సెలక్ట్ చేసినట్టు సమాచారం.