భర్తలు భార్యలను ఏఏ సందర్భాలలో కొడతారో తెలుసా! - MicTv.in - Telugu News
mictv telugu

భర్తలు భార్యలను ఏఏ సందర్భాలలో కొడతారో తెలుసా!

May 10, 2022

స్త్రీ, పురుషుల వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు, గొడవలపై జాతీయ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. భర్తలు భార్యలను కొట్టడం, మారిటల్ రేప్ వంటి అంశాలపై 15 – 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల అభిప్రాయాలను సర్వే సేకరించింది. ఇందులో మారిటల్ రేప్ అంశంపై స్త్రీ, పురుషులు ఇరువురూ తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. సర్వే నివేదిక ప్రకారం.. తమకు ఇష్టం లేనప్పుడు భర్తతో ఏకాంతానికి ఒప్పుకోమని చెప్పే భార్యల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగింది. అలాగే భార్యలను ఇబ్బంది పెట్టబోమని చెప్పే పురుషుల సంఖ్య కూడా పెరిగింది.

ముఖ్యంగా భార్యలు మూడు కారణాలతో శృంగారానికి దూరంగా ఉంటారని తేలింది. అవి భర్తకు సుఖ వ్యాధులుండడం, వివాహేతర అక్రమ సంబంధాలుండడం, కోరిక లేకపోవడం లేదా అలసటగా ఉన్నప్పుడు కలయికకు ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో పై కారణాలేవీ లేకుండా భార్య కలయికకు ఒప్పుకోకపోతే తమకు దండించే అధికారం ఉందని చెప్పే భర్తల సంఖ్య పెరిగింది. అలాగే భర్తలకు తమను దండించే అధికారం లేదని 80 శాతం మంది భార్యలు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలువడింది. ఏఏ సందర్భాలలో భర్తలు తమ భార్యలను కొడతారు అనే ప్రశ్నకు దాదాపు 44 శాతం మంది పురుషులు తమ కారణాలతో ఏకీభవించారు. అవి. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, వాదనకు దిగడం, కలయికకు ఒప్పుకోకపోవడం, వంట సరిగా చేయకపోవడం, భర్త పట్ల విశ్వాసంగా ఉండకపోవడం ,అత్తమామల పట్ల గౌరవంగా మసలుకోకపోవడం వంటి సందర్భాల్లో భార్యలపై చేయి చేసుకుంటామని పురుషులు అభిప్రాయపడ్డారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. పైకారణాలతో భర్తలు భార్యలను కొట్టడం కరెక్టే అని చెప్పిన వారిలో పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువగా ఉండడం ఆసక్తికర అంశం. దీంతో పాటు భార్యలను అదుపులో ఉంచడం కోసం కొడతామని చెప్పే పురుషుల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగింది.