ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సాగించాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. చాలామంది జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ అనేది మనదేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెరకు బదులుగా బెల్లంను తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పంచదారకు బదులుగా కోకోనట్ షుగర్ కూడా వాడవచ్చు. చాలామందికి కోకోనట్ షుగర్ గురించి తెలియదు. దీనిని కొబ్బరికాండం నుంచి తీసిన ద్రవంతో తయారు చేస్తారు. దీనితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ కోకోనట్ షుగర్ మధుమేహవ్యాధిగ్రస్తులకు చాలా మంచది. వీరు తక్కువ గ్లైసీమాక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే మనం ప్రతి రోజు ఉపయోగించే పంచదారలో గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 65 శాతం ఉంటుంది. అదే అదే కోకోనట్ షుగర్ లో కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. అంతేకాదు దీంట్లో ఇన్సులిన్ కూడా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గ్లూకోస్ లెవెల్స్ ను తగ్గిస్తుంది.
డయాబెటిస్ లేనివారు కూడా దీన్ని తీసుకుంటే డయాబెటిస్ రాకుండా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పౌడర్ ను వాడినట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటంతోపాటు దీనిలో ఉండే విటమిన్ సి, నైట్రోజన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
కోకోనట్ షుగర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఈ కోకోనట్ షుగర్ ను జ్యూస్ లో కానీ, పాలలో కానీ, టీ, కాఫీల్లో కలిపి తీసుకోవచ్చు. ఒకట్రెండు స్పూన్లకు మించి తీసుకోకూడదు.